March 28, 2013
మాకు 'కాపు' కాసింది వీళ్లే!

కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని ఊదరగొట్టిన ఆ పెద్దమనిషి.. వీళ్లను రోడ్డుమీద వదిలేసి ఢిల్లీకి ఉడాయించాడు. వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాపులు సొంత ఇళ్లకు మళ్లుతున్నారు. రాయవరంలో కలిసిన కాపులు ఇదే ఆకాంక్ష వ్యక్తం చేశారు. పసుపు జెండాకు వారిచ్చిన సత్తువ ఎలా మరిచిపోగలం? అదే చెప్పాను. వారి కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భుజం తట్టాను. అక్కడ నుంచి కదులుతూ చూస్తే, వారి కళ్లలో చిన్నపాటి ఆశ కదలాడింది.
చిన్న చిన్న పల్లెల నుంచి ఒక మోస్తరు పట్టణాల దాకా కరెంటు కోసమే ఎదురుచూపులు! పంట పండాలన్నా, బతుకు నిండాలన్నా కరెంటు బుడ్డే ఆధారం.
తుసుకూడిలో పదిమందితో మాట్లాడితే ఎనిమిది మందిలో ఇదే ఆవేదన. లాకౌట్‌కు సిద్ధమవుతున్న మిల్లులను దారిలో చూశాను. బేరాల సమయంలో బయట దిగాలుగా కూర్చున్న వెల్డింగ్ షాపు ఓనర్లను చూస్తే బాధనిపించింది. చార్జీల నుంచి సర్‌చార్జీల దాకా.. పాపాలు పెరిగి పెరిగి ఏదో ఒక రోజున ఈ సర్కారుకీ షాక్ తగలకపోదు!
Posted by
arjun
at
2:59 AM