
విశాఖపట్నం : 'సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తాను' అని
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలను
ఎప్పటికప్పుడు దగ్గరగా, సునిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆదివారం
సింహాచల వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం 'ఆంధ్రజ్యోతి'
ప్రతినిధితో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ శ్రేణుల్లో తనకు ఆదరణ
పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించగా... "అది అంత ప్రధానం కాదు. మా అందరికీ
చంద్రబాబు ముఖ్యం. ప్రజలతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. మేమంతా ఆయన వెంట
సేవకుల్లా నడుస్తున్నాం'' అని తెలిపారు.
చంద్రబాబు చేపట్టిన
పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతమైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల
ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని లోకేశ్ తెలిపారు. ఇందుకు సహకరించిన
వారందరికీ ధన్యవాదాలు తెలిపారు