
కాకినాడ : 'అమ్మ హస్తం' పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను
మోసగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పన్నుల రూపంలో
పేదలపై నెలకు రూ.3 వేల భారం వేసి.. ఆ తొమ్మిది సరుకులను మాత్రం రూ.185కు
ఇస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని ఆరోపించారు.
బాబు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం..' పాదయాత్ర 190వ రోజు గురువారం తూర్పు
గోదావరి జిల్లా తుని మండలం ఎన్ సూరవరం, ఎన్ఎస్ వెంకట నగరం, కూటయ్యపాలెం
గ్రామాల్లో సాగింది.
ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో.. ఎన్నికల ఏడాది కాంగ్రె
"ఇది అమ్మ హస్తం కాదు.. మొండి హస్తం'' అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ
పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేశారని చంద్రబాబు
ఆక్షేపించారు. రూ.5 వేల వైద్యానికి రూ.50 వేలు బిల్లు వేస్తున్నారని
పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ ముక్కుకూ మీటరు పెట్టి పీల్చుకునే గాలికీ
పన్నేసేలా ఉన్నాడని మండిపడ్డారు.
స్ చేసే
జిమ్మిక్కుల్లో భాగంగానే 'అమ్మ హస్తం' పథకాన్ని ప్రారంభించారని చంద్రబాబు
ఆరోపించారు. ఈ పథకంలో ఇచ్చే సరుకులు కాకుండా ప్రతీ పేద కుటుంబానికి
అవసరమయ్యే... 20 కిలోల బియ్యానికి రూ. 800, 2 కిలోల పప్పు రూ.150, చక్కెర
రూ.84, కూరగాయలు, పాలు రూ.వెయ్యి, వంటనూనె రూ.100, పెరిగిన విద్యుత్
బిల్లులకు రూ.వెయ్యి.. మొత్తంగా నెలకు 3 వేల రూపాయలకుపైగా భారం పడుతుందని
వివరించారు.