April 12, 2013
నొప్పి జీవితాంతం కొనసాగినా మీ కోసం భరిస్తా: చంద్రబాబు
కాళ్లు, కండరాల నొప్పులు తీవ్రం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం
నేడు చంద్రబాబుకు పరీక్షలు.. విశాంత్రికి సూచన!
మూడు నెలలుగా కాలునొప్పి తీవ్రంగా బాధిస్తోంది
విశ్రాంతి తప్పనిసరని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు
లేకపోతే నొప్పి శాశ్వతమవుతుందని హెచ్చరిస్తున్నారు

హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రత్యేక వైద్యుల బృందం శుక్రవారం తన ఆరోగ్యాన్ని పరీక్షిస్తుందని, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలో సూచిస్తుందని తెలిపారు. నొప్పి తగ్గాలంటే హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని డాక్టర్లు చెబుతారని వివరించారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోకపోతే కండరాల నొప్పి మరింత తీవ్రం కావడమే కాకుండా ఈ నొప్పి శాశ్వతంగా ఉండిపోతుందని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారని తెలిపారు. "మీ సమస్యలను పరిష్కరించగలిగితే చాలు.. ఈ నొప్పులు జీవితాంతం కొనసాగినా మీ కోసం భరిస్తా'' అని పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
2:35 AM