April 11, 2013
చంద్రబాబు పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు

ఈ నెల 12న నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద ప్రారంభమై ఆరున్నర గంటలకు శరభవరం, ఏడున్నర గంటలకు శృంగవరం, ఎనిమిదిన్నర గంటలకు గాంధీనగరం, తొమ్మిదిన్నర గంటలకు తాండవ జంక్షన్, పది గంటలకు డి. ఎర్రవరం జంక్షన్‌కు చేరుకుంటారు.
ఇక్కడ మదర్ థెరెసా బీఈడీ కాలేజీలో రాత్రి బస చేస్తారు. 13వ తేదీన డి.ఎర్రవరం జంక్షన్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమై ఐదుగంటలకు ములగపూడి, ఆరు గంటలకు ఎం.బెన్నవరం, ఏడు గంటలకు నర్సీపట్నం మండలం కృష్ణాపురం, తొమ్మిది గంటలకు బయపురెడ్డిపాలెం, పది గంటలకు బలిఘట్టం పెట్రోల్‌బంకు వద్దకు చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 14వ తేదీ ఆదివారం పాదయాత్ర వుండదు. 15వ తేదీన బలిఘట్టంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమై ఐదు గంటలకు నర్సీపట్నం అబీద్ సెంటర్, ఏడు గంటలకు బొడ్డేపల్లి జంక్షన్, ఎనిమిది గంటలకు సుబ్బారాయుడుపాలెం, ఎనిమిదిన్నర మాకవరంపాలెం మండలం చంద్రయ్యపాలెం, తొమ్మిది గంటలకు గంగవరం, తొమ్మిదిన్నరకు దాలింపేట, పదిగంటలకు కొండల అగ్రహారం, పదిన్నర గంటలకు నల్లమారమ్మగుడి వద్దకు చేరుకుని రాత్రికి ఇక్కడ బస చేస్తారు. 16వ తేదీన నల్లమారమ్మగుడి వద్ద పాదయాత్రను ప్రారంభించి ఐదు గంటలకు మాకవరపాలెం, ఆరు గంటలకు తామరం, ఆరున్నరకు రాచపల్లి జంక్షన్, ఏడు గంటలకు రామన్నపాలెం జంక్షన్, ఎనిమిది గంటలకు బీబీపాలెం, ఎనిమిదిన్నర గంటలకు దుంగలవానిపాలెం జంక్షన్, తొమ్మిది గంటలకు శెట్టిపాలెం, తొమ్మిదిన్నరకు రాజుపేట, పది గంటలకు కశింకోట మండలం పాతకన్నూరుపాలెం అక్కునాయుడు కర్రల డిపో వద్దకు చేరుకుని రాత్రి బస చేస్తారు. 17న అక్కునాయుడు కర్రల డిపో వద్ద నాలుగు గంటలకు బయలుదేరి నాలుగున్నర గంటలకు కన్నూరుపాలెం, ఐదున్నరకు ఆనందపురం జంక్షన్, ఆరు గంటలకు కొత్తూరు, ఏడు గంటలకు అడ్డాం జంక్షన్, 7.15 గంటలకు జి.భీమవరం, ఎనిమిదిన్నరకు అచ్చెర్ల జంక్షన్, తొమ్మిదికి బంగారయ్యపేట, పది గంటలకు తాళ్లపాలెం చేరుకుని రాత్రి బస చేస్తారు. 18న తాళ్లపాలెం నుంచి బయలుదేరి ఐదు గంటలకు అమీన్‌సాహెబ్‌పేట జంక్షన్, 5.15కు గొబ్బూరు జంక్షన్, 5.45కు నర్సింగబిల్లి, 6.15కు సోమవరం, 6.45కు సోమవరం బ్రిడ్జి, 7.15కు మునగపాక మండలం గణపర్తి, 7.30 గంటలకు చూచుకొండ, 8.45 గంటలకు ఎం.జగన్నాథపురం, పది గంటలకు జగన్నాథపురం చేరుకుని రాత్రి బస చేస్తారు. 19వ తేదీన జగన్నాథపురంలో బయలుదేరి 4.45 గంటలకు మల్లవరం జంక్షన్, ఐదు గంటలకు ఉప్పవరం, 5.45కు ఎర్రవరం, 6.15కు కొండకర్ల జంక్షన్, ఏడు గంటలకు హరిపాలెం, 7.15కు తిమ్మరాజుపేట, 8.15కు మునగపాక, 9.45 గంటలకు గంగాదేవిపేట జంక్షన్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 20వ తేదీన గంగాదేవిపేటలో బయలుదేరి 4.15 గంటలకు ఒంపోలు, 4.45కు నాగులాపల్లి, 5.15కు అనకాపల్లి బైపాస్ జంక్షన్, 5.45కు ఆర్టీసీ కాంప్లెక్స్, ఆరు గంటలకు నెహ్రూచౌక్ జంక్షన్, 6.15కు ఎన్టీఆర్ జంక్షన్, ఆరున్నరకు చిననాలుగురోడ్ల జంక్షన్, 6.45కు రింగ్‌రోడ్డు జంక్షన్, ఏడుకు పార్కు జంక్షన్, 7.15కు సుంకరమెట్ట జంక్షన్, 8.30 గంటలకు శంకరం, 8.45కు రేబాక చేరుకొని రాత్రి బస చేస్తారు. 21వ తేదీ ఆదివారం విరామం. 22వ తేదీన రేబాకలో బయలుదేరి 4.15 గంటలకు కాపుశెట్టివానిపాలెం, 4.30కు కోడూరు జంక్షన్, ఐదుకు మర్రిపాలెం, ఆరుకు సబ్బవరం మండలం బాటజంగాలపాలెం, ఆరున్నరకు సున్నంబట్టీల జం
Posted by
arjun
at
6:15 AM