
హైదరాబాద్: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ మృతికి కారణమైన
బాధ్యులను కఠినంగా శిక్షించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బా«ధిత
కుటుంబానికి తమపార్టీ అండగా ఉంటుందన్నారు. స్పీకర్ మనోహర్ నియోజకవర్గంలో
అధికార పార్టీకి చెందిన కామాంధుల చేతిలో బలైన దళిత మహిళ కుటుంబానికి
న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలుగుమహిళా రాష్ట్ర
అధ్యక్షురాలు శోభా హైమావతి హెచ్చరించారు.
నిర్భయ చట్టం వల్ల ఏం ఒరిగిందని ఆమె ప్రశ్నించారు. స్పీకర్ సొంత
నియోజకవర్గంలోనే దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుయువత
ధ్వజమెత్తింది. మహిళలపట్ల అఘాయిత్
యాలు ఢిల్లీలో జరిగితే ఒకలా,
ఆంధ్రప్రదేశ్‌లో జరిగితే ఒకలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలుగుయువత
రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు. కాగా, ఈ సంఘటనలో
బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.