April 24, 2013
27న టీడీపీ శ్రేణుల చలో వైజాగ్

ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు సమష్టిగా చేసిన పోరాటాల ఫలితం గా భవానీ ద్వీపం ప్రైవేటు పరం కాలేదన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో కలిపినందుకు నజరానాగా చిరంజీవి సలహా మేరకు మంత్రి ఘంటా శ్రీనివాసరావుకు భవానీద్వీపం లీజుకిద్దామని అనుకున్నారన్నారు. కాని దీనిపై తీ వ్రంగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనుకకు తగ్గిందన్నారు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలకు ఎంపీ రాజగోపాల్, అధికా
రపార్టీ ఎమ్మెల్యేలు అడ్డు పడుతున్నారన్నారు.
వైసీపీ నాయకులు సామినేని ఉదయ భాను, జోగి రమేష్‌లు ఇష్టాను సారం మాట్లాడుతున్నారన్నారు. జగన్ అంత అవినీతి పరుడు లేడన్నారు. పాదయా త్ర చేస్తున్న షర్మిల రక్షణ స్టీల్ విషయమై ఎందుకు మాట్లాడదన్నారు. ఆమె పాదయా త్ర ఫ్లాప్ షో అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బయ్యారం నుంచి తరలిం చిన వందల లారీల ఖనిజానికి ప్రభుత్వం సుంకం రాబట్టాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
11:52 PM