March 20, 2013
కాటన్ స్మరణతో రాజమండ్రిలోకి..

కాటన్ స్మరణతో రాజమండ్రిలో అడుగుపెట్టాను. ఠీవిగా నిలిచిన వీరేశలింగం పంతులు విగ్రహాన్ని దారిలో చూసి స్ఫూర్తి పొందాను. ఆయన ధీరత్వమే తెలుగు జాతికి వరం. ఆదికవి నన్నయ తిరిగిన ఈ నేలపై అడుగులు వేయడం ఒకరకమైన ఉత్సాహాన్ని నాలో కలిగించింది. ఎదురుగా వచ్చిన వస్త్ర వ్యాపారులను చూసినప్పుడు మరింత సంతోషం కలిగింది. ఈ గడ్డపై మరోసారి వారితో గొంతు కలపగలిగాను. వీరి పట్టుదలను ఎవరైనా అభినందించాల్సిందే. ప్రభుత్వం మాత్రం అరెస్టులు, ఆంక్షలంటూ వేధించుకుతింటోంది. వ్యాట్‌పై నిర్ణయం ఇక ప్రజలదే. వాళ్ల సహకారం లేకుండా ఈ ఉద్యమం ముందుకు పోదు. వ్యాట్‌ను అందరి సమస్యగా గుర్తించినప్పుడే అది సాధ్యం! ఇది రెండువైపులా జరగాల్సిన ప్రయత్నం. అప్పుడిక ఈ ప్రభుత్వానికి చేయడానికేం ఉండదు...తప్పుకోవడం తప్ప!
Posted by
arjun
at
9:55 PM