
బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శుక్రవారం
కరీంనగర్‌లో టీడీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ కార్యకర్తలు
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం
కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష
సమావేశం ఏర్పాటు చేసి బాబ్లీపై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నారు.