
క్రోసూరు: మామా, అల్లుళ్ళైన యువరత్న
నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌బాబులు త్వరలో
పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్
వెల్లడించారు. గురువారం శ్రీధర్ మాట్లాడారు. బాలకృష్ణ, లోకేష్‌ల పర్యటన
నియోజకవర్గంలోని వివిధ మండలాలలోను, గ్రామాలలోను ఏర్పాటు చేస్తున్నట్టు
చెప్పారు. వివిధ గ్రామాలలో నెలకొల్పనున్న ఎన్టీ రామారావు విగ్రహాలను వారు
ఆవిష్కరిస్తారని, పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు. పర్యటన
తేదీని త్వరలో ఖరారు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికలలో వెనుకబడిన
వర్గాల వారికి 100సీట్లను ఇస్తామన్న తెలుగుదేశం వాగ్దానం కచ్చితంగా అమలు
జరుగుతుందని, ఇప్పటికే సుమారు 50 సీట్లకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని ఆయన
చెప్పారు. రానున్న అన్నిరకాల ఎన్నికలలోను కార్యకర్తలు చురుకైన పాత్ర
పోషించాల్సి ఉంటుందని, బలమైన కార్యకర్తల అండ తెలుగుదేశం పార్టీకి ఉండటం
పార్టీ అదృష్టమని ఆయన తెలిపారు.