March 15, 2013
మీరంతా కష్టపడాల్సిందే...

వాళ్ళకంటే మించి పనిచేసే వా ళ్ళం కూడా ఉన్నాం. దీనిని కూడా పరిశీలించండి అని నరసాపురం కార్యకర్తలు అధినేత ఎదుటే తెగేసి చెప్పారు. పార్టీ విషయంలో మొదటి నుంచి మనం ఒక స్థ్ధిర అభిప్రాయాలతోనే ఉన్నాం, కార్యకర్తలే పార్టీకి ముఖ్యం. నాకు ఎవరూ ఎక్కువా కాదు, తక్కు వా కాదు.. అందరూ ఒకటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. నరసాపురంలో కొంత వెనుకబడి ఉన్నమాట వాస్తవమేనని సరైన అభ్యర్థ్ధిని ఇస్తాను..ఆలోపే ఒక కమిటీని కూడా మీ వద్దకు పంపిస్తానని కార్యకర్తలను బాబు ఊరడించారు. రైతులకు రుణం మాఫీ చేస్తామని మన పార్టీ చెబుతున్నది, మీరు కూడా తొలి సంతకం చేస్తామని చెబుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మా త్రం మనది రైతు వ్యతిరేక పార్టీ అని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారని ఒక కార్యకర్త ప్రస్తావించినప్పుడు చంద్రబాబు దీనిపై సీరియస్‌గా ప్రతిస్పదించారు.
'అసలు రైతులకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ వాళ్ళను మీరే నిలదీయండి, మనం ఏం చేస్తున్నాము..ఏమేమి చేయబోతున్నామో అందరికీ స్పష్టంగా చెప్పండి, అదే మీరు చేయాల్సిన పని. దీంట్లో వెనక్కి తగ్గితే ఎలా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్నానని రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెబుతూ వచ్చేవాడు. అదే విషయాన్ని నేను అసెంబ్లీలో నిలదీస్తే చెప్పలేక పారిపోయాడని కార్యకర్తల హర్షధ్వనాల మధ్య చంద్రబాబు చెప్పుకొచ్చారు. నరసాపురం నియోజకవర్గం లో వరుసగా రెండుసార్లు ఓడిపో యాం, ఇప్పుడు మన పరిస్థ్ధిితి అధ్వాన్నంగా మారిందని ఇంకొందరు కార్యకర్తలు చెప్పగా మీకు ఏ ఇబ్బందీ లేదు, ఈ విషయం లో అందరూ కలిసి పని చేస్తే మనకి ఎదురొచ్చేవారెవరని అన్నారు. నరసాపురంలో మనం కొంత వెనుకబడిన మాట నిజమే అయినా కూడా ఇది ఒక నాకు సవాలు. కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండండి, ఏం చేయాలో అదే చేసి చూపెడదామన్నారు.ఎన్నికల ముందు డాక్టర్ బాబ్జీ, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణలు అభ్యర్థ్ధులుగా పో టీ చేయమని చెప్పినప్పటికీ వారికి ఉన్న మంచిపేరును దృష్టిలో పెట్టుకుని నేనే వారిని ఒప్పించి అభ్యర్థ్ధులు గా రంగంలోకి దింపానని చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు.
ఇక రుణమాఫీ విషయంలో ఏమేమి చేయాలో నాకు ఒక ఆలోచన ఉంది. తప్పనిసరిగా అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో కష్టసుఖాలను అనుభవించినవారు ఉన్నారు. పదవులు ఇచ్చిన వా రు కొన్ని చోట్ల పని చేయకుండా పోతే పదవిరాని వారు మా త్రం బాధపడ్డారని, ఇది కూడా తనకు తెలుసన్నారు. ఏమైనప్పటికీ సమర్ధవంతమైన నాయకులు మీ నుంచే రావాలి. పార్టీని బతికించుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా మరోమారు బలబలాలపై సమీక్షిస్తానని, రాగ ద్వేషాలకు అతీతంగా ఉమ్మడిగా పార్టీని గెలిపించుకోవాలని కోరారు.
Posted by
arjun
at
12:47 AM