January 8, 2013
అవినీతిపరులకు సీఎం అండ

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి పరులకు అండగా నిలుస్తున్నారని
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెల్లికుదురు మండల
కేంద్రానికి చేరుకోవడానికి ముందు భారీగా తరలివచ్చిన ఆశేష జనవాహి ని ఘన స్వాగతం పలికారు.
బతుకమ్మలు, బోనాలు, చిందు యాక్ష గా నాలు, కళాకారుల నృత్యాలు అలరింప చేశాయి. అనంతరం
బహిరంగ సభ లో చంద్రబాబు మాట్లాడారు. అవినీతిలో భాగస్వాములుగా నిలిచిన మం త్రి ధర్మారపు
ప్రసాదరావును ఎందుకు కాపాడుతున్నారని సీఎంను ప్రశ్నించాడు. పరిటాల సునిత కుమారుడు శ్రీరాములుపై
తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రం లో అభివృద్ధి పూర్తిగా క్షీణించిపోయిందన్నారు.
నేడు బీహార్, గుజరాత్, ఆం ధ్రప్రదేశ్ కంటే అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు.
'అభివృద్ధిలో నిల్... అవినీతిలో ఫుల్' అన్న చందాన రాష్ట్ర పరిస్థితి వుందన్నారు.
అవినీతికి జై.. అభివృద్ధికి నై..
రాబోయే రోజుల్లో అందరూ మం త్రులపై విచారణ కొనసాగితే జైల్‌లోనే క్యాబినెట్
మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకుందన్నారు. కేంద్రంలోని సోనియా గాంధీకి రాష్ట్రంలోని
అవినీ తి పరిస్థితి తెలిసినప్పటికీ మౌనం వ హించడంలో అర్థమేమిటో ప్రజలు గ మనించాలన్నారు.
నేడు కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీలు అవినీతికి జై, అభివృద్ధికి నై అంటున్నారన్నారు.
టీడీపీతోనే తెలంగాణ అభివృద్ధి
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు.
ఎస్సారెస్పీ కా లువలు తవ్వించి లైనింగ్ పనులు కొనసాగించిన ఘనత టీడీపీదేనన్నారు. తెలంగాణకు
తాను వ్యతిరేకం కాదని వ్యతిరేకంగా మాట్లాడనని స్పష్టం చేశారు. కేసీఆర్ బ్లాక్‌మెయిల్
రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పాదయాత్రను ఆపను
పాదయాత్ర ప్రారంభించి వంద రోజులైందని చంద్రబాబు అన్నారు. ఒక వైపు గొంతు నొప్పి,
కాలు నొప్పి బాధిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాల ముందు అవి నిలవ లేవని, ఎన్ని
ఇబ్బందులు ఎదురైనా యాత్రను కొనసాగిస్తానని వెల్లడించా రు. ప్రజల జీవితాల్లో వెలుగులు
నిం పేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సీఎం అవినీతిపై నేరుగా పీసీసీ అధ్యక్షుడే ఢిల్లీలో ఫిర్యాదు చేసిన ఎటువంటి
చర్యలు లేవన్నారు. విద్యుత్ ఒ ప్పందాలపై వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. తాము అధికారంలోకి
వస్తే వ్యవసాయ పనులకు ఈజీఎస్‌ను వర్తింప చేయడం, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, వడ్డీ
మాఫీ కొనసాగిస్తామన్నారు. ఈ సభలో టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు,
ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ బొడకుంట్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్
మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, బొజ్జపల్లి రాజయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన
బస్వారెడ్డి, జాటోతు నెహ్రూ నాయక్, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, గుగులోతు దేవిక, శంకర్‌నాయక్,
గం డ్ర సత్యనారాయణ, బీరెడ్డి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:41 AM