January 8, 2013
వస్తున్నా మీకోసం' బాబు పర్యటన ఇలా

టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' యాత్ర వివరాలు తేదీలవారీగాఇవీ..
8వ తేదీ రాత్రి: పాలేరు నియొజకవర్గం, తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం మిషనరీ
హైస్కూల్‌లో బస.
9వ తేదీ: ఉదయం టీడీపీ రాష్ట్రకమిటీ సమావేశం, 100 అడుగుల స్తూపావిష్కరణ, అనంతరం
అక్కడే బహిరంగసభ, తర్వాత సుబ్లేడు, హస్నాబాద్, బచ్చోడు వరకు పాదయాత్ర, అక్కడే రాత్రి
బస, మొదటిరోజు పాదయాత్ర 10.9 కిలోమీటర్లు.
10వ తేదీ: బచ్చోడు నుంచి బంధంపల్లి, బీరోలు మీదుగా కూసుమంచి మండలం లోకి పాదయాత్ర
ప్ర వేశం. పెద్దపోచారం వద్ద మధ్యాహ్న భోజన విరామం, చిన్నపోచారం, కిష్టాపురం, తురకగూడెం
క్రాస్‌రోడ్, కూసుమంచిలో రాత్రి బహిరంగసభ, అక్కడే బస, మొత్తం 18 కిలోమీటర్ల పాదయాత్ర.
11వ తేదీ: కూసుమంచి నుంచి లోక్యాతండా, కోక్యాతండా, నేలపట్ల, మీదుగా జీళ్లచెరువు
వరకు పాదయాత్ర. అక్కడే మధ్యాహ్న భోజనం. అనంతరం గోపాలరావుపేట మీదుగా ఖమ్మం రూరల్ మండలంలోకి
ప్రవేశం, తల్లంపాడు, పొన్నెకల్ క్రాస్‌రోడ్డు, మద్దులపల్లి, తెల్దారుపల్లి క్రాస్‌రోడ్,
కోదాడ క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర. అక్కడ రాత్రి బస. మూడోరోజు మొత్తం 18 కిలోమీటర్ల
పాదయాత్ర
12వ తేదీ: ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్‌రోడ్ నుంచి వరంగల్ క్రాస్‌రోడ్,
పెద్దతండా, జలగంనగర్, నాయుడుపేట మీదుగా పాదయాత్ర ఖమ్మం నగరంలోకి ప్రవేశిస్తుంది. ఖమ్మం
కార్పొరేషన్‌లో నయాబజార్, మయూరిసెంటర్, బస్ డిపో, రాపర్తినగర్, బైపాస్‌రోడ్డు, ఎన్‌టీఆర్
విగ్రహం, ఇల్లెందు క్రాస్ రోడ్, అంబేద్కర్ సెంటర్, ఆర్‌టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్,
కమాన్‌బజార్, ప్రభాత్‌టాకీస్, చర్చికాంపౌండ్ వరకు పాదయాత్ర. సెయింట్ జోసఫ్ స్కూల్‌లో
రాత్రి బస, మొత్తం 13.5 కిలోమీటర్లు పాదయాత్ర
13వతేదీ: ఖమ్మం పట్టణంలోని సెయింట్‌జోసఫ్ స్కూల్‌లో సంక్రాంతి ఉత్సవాల అనంతరం
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్ నుంచి మధ్యాహ్నం
3 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం లక్ష్మీపురం,
చిరుమర్రి వరకు యాత్ర కొనసాగుతుంది. అక్కడే రాత్రి బస. ఐదో రోజు పాదయాత్ర 9 కిలోమీటర్లు.
14వ తేదీ: చిరుమర్రి, వనంవారి కిష్టాపురం, అమ్మపేట క్రాస్‌రోడ్, కమలాపురం,
అయ్యగారిపల్లి, బానాపురం, వల్లభి వరకు యాత్ర. అక్కడ రాత్రి బహిరంగ సభ అనంతరం అక్కడే
రాత్రి బస. ఆరో రోజు 17 కిలోమీటర్లు పాదయాత్ర.
15వ తేదీ: వల్లభి బస అనంతరం పాదయాత్ర కార్యక్రమం ఖరారు కావాలి. నల్గొండ వైపు
చంద్రబాబు యా త్ర ఉంటే నేలకొండపల్లి మండలంలోని ఎ. నర్సింహాపు రం, రాయిగూడెం, బుద్దాపురం,
చెర్వుమాదారం, పైనంపల్లి వరకు ఉంటుంది. కృష్ణా జిల్లావైపు మారితే వల్లభి నుంచి 15న
జరిగే యాత్ర గ్రామాల్లో మార్పులుంటాయి.
Posted by
arjun
at
7:03 AM