January 8, 2013
గుక్కెడు గంగ లేని తండాలెన్నో!
కానీ, దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం ఏమిటి? 1,50,000
కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకునే అర్హత అసలు ఈ ప్రభుత్వానికి ఉన్నదా? " సారూ..ఏమని
చెప్పాలి..దూప వేస్తే తాగేందుకు గంగ లేదు. మంచినీరు లేదని గొంతు ఎండకుంటుందా? దొరికిన
నీళ్లు తాగి బిమారయితే దవాఖానా ఉండదు. ఒకటీ అర ఉన్నా వైద్యులు ఉండరు. వాళ్లూ ఉన్నారనుకుంటే
మందులు ఉండవు. పోనీ టౌన్‌కు వెళదామంటే ఊరికి సరైన రోడ్డే లేదు. జరూరు పడితే 108 వాహనం
వచ్చిపోవడమూ కష్టమే'' అంటూ వాపోయారు.
నేను ఈ జిల్లాలో అడుగుపెట్టినప్పటినుంచీ చూస్తున్నాను..ఏ పల్లెకూ ఏ తండాకూ
కచ్చా దారులు తప్ప పక్కా రోడ్లు లేవు. మంచినీటి గుంటల్లో పాచి పేరుకుపోయింది. డ్రైనేజీ
లేక గుడిసెల ముందు మురుగు మడుగు కట్టడం గమనించాను. ఈ తండాలు రాష్ట్రంలో భాగమే కాదన్నట్టు
పాలకుల తీరు ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఇంకెంత దారుణంగా ఉంటుందో! దీన్ని దృష్టిలో
ఉంచుకొనే ఎన్టీఆర్ సుజల పథకం ప్రకటించాను. రైతు రుణాల మాఫీ, బెల్టు షాపుల ఎత్తివేత
తరువాత ఈ అంశానికే నా ప్రాధాన్యం!
దారిపొడవునా కులసంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు నాతో పాటు నడిచి సంఘీభావం
తెలిపాయి. వారి అభిమానం వెల కట్టలేనిది. మహిళలు బోనాలతోనూ, గీత కార్మికులు మోకులతోనూ,
మత్స్యకారులు వలలతోనూ, గొర్రెల కాపరులు గొర్రె పిల్లలతోనూ నాకు స్వాగతం పలికారు. వీరందరికి
నేనెంత రుణపడిపోతున్నాను!
Posted by
arjun
at
7:21 AM