January 10, 2013
బాధలు వింటూ. భరోసానిస్తూ..

అధైర్యం వద్దు ఆదుకుంటాం..
కుమ్మరి రాములుకు భరోసా
తిరుమలాయ పాలెంకు చెందిన కుమ్మరి రాములు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద ఆగిన
చంద్రబాబు ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. సారెను తిప్పు తూ కుమ్మరుల సమస్యలు విన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వి« దాలా ఆదుకుంటామని భరోసా ఇ చ్చారు
నేతన్నకు అండగా చంద్రన్న
నేతన్నల జీవితాల్లో కొత్త కాంతులు నింపుతానని చంద్రన్న హామీ ఇచ్చారు. నేలకొండపల్లి
మండలానికి చెందిన నేత కార్మికుడు అప్పన శ్రీరాములుతో చంద్రబాబు మాట్లాడారు. సమస్యలు
పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కళాకారుల కన్నీరు తుడుస్తా..
చిందుభాగవత కళాకారులకు భరోసా
కళాకారులు కంటతడి పెడితే రాజ్యానికి క్షేమం కాదని చంద్రబాబు నా యుడు అన్నారు.
వరంగల్ జిల్లా నెల్లుట ్లకు చెందిన చిందు భాగవత కళాకారుల స్టాల్‌లో ఆగిన బాబు వారి
బాధలు వి న్నారు. కళాకారులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయని కాంగ్రెస్ సర్కారుకు వా రి
ఉసురు తగులుతుందన్నారు.
గీత కార్మికుల రాత మారుస్తా
గీత కార్మికులకు వృధ్దాప్య పింఛన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర సమస్యలు పరిష్కరిస్తానని
చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా గీత కార్మికుల మోకు లొట్టిని ధరించారు
ఆడపడుచులకు అండగా ఉంటాం
కుట్టమిషన్ పనులు చేసే ఆడపడుచులకు అండగా ఉంటామని చంద్రబాబు అన్నారు. మహిళలు
ఏర్పాటు చేసిన మి షన్ కుడుతూ వారి సమస్యలు విన్నారు. వృద్ధ మహిళలకు పింఛన్లు, యువతుల
కు రుణాలు ఇప్పిస్తానన్నారు.
అలసత్వం వలదు....
చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర వందరోజులు
పూర్తిచేసుకుంది. ఈనేపథ్యంలో తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కార్యకర్తలకు
దిశానిర్దేశం చేశారు. అలసత్వం వీడాలని సూచించారు. ప్రజ ల సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వ
వైఫల్యాలను ఎండగట్టాలని సూచించా రు. పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని
నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, 155 నియోజకవర్గాల్లో మాత్రమే ఈకార్యక్రమాన్ని
చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడినప్పుడు
స్థానిక నాయకులు వెంటనే ఒక కార్యచరణ రూపొందించుకోవాల న్నారు. ప్రజలకు అండగా నిలవాలని
ఆయన సూ చి ంచారు. నియోజకవర్గాల్లో ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకులను మా త్రమే ఎన్నికల్లో
అభ్యర్థులుగా ప్రకటిస్తామని తెలిపారు. పైరవీలకు లొంగేది లేద ని స్పష్టం చేశారు. నియోజకవర్గ
ఇన్‌చార్జిలు తమ పనితీరును మార్చుకోవాలన్నారు. పనితీరు మార్చుకొనేందుకు ఒకట్రెండు అవకాశాలు
కల్పిస్తానని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాయకులు ఉదాసీనత వీడాలని ఆయన పిలుపునిచ్చారు. ము ఖ్యం గా సమన్వయంతో ముందుకెళ్లాలని
లేకపోతే ప్రత్యమ్నాయ నాయకత్వాన్ని ఏ ర్పాటు చేస్తామన్నారు.
Posted by
arjun
at
12:10 AM