January 10, 2013
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు

పోరాటాలకు నెలవైన ఖమ్మం జిల్లాలో.. నా పాదయాత్ర వందో రోజున అడుగుపెట్టాను.
ఈ ప్రస్థానంలో వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలు వచ్చినా ఉదాత్త ఆశయంతో మొదలైన నా యాత్ర
నిర్విఘ్నంగా కొనసాగించాలని పట్టుదలతో ముందుకు కదిలాను. నా యాత్ర విజయవంతంగా సాగడం
వెనుక ఎందరో వ్యక్తుల కృషి ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన తరుణమిది.
ఈ 100 రోజుల యాత్ర ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతా. మరికొన్ని లక్షల మంది ప్రజలను
కలుస్తా. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారిలో ఒకడిగా ముందుకు అడుగు వేస్తా!!
నోట్: చంద్రబాబు 2012, అక్టోబర్ 2న పాదయాత్ర ప్రారంభించారు. నాటి నుంచి
బుధవారానికి సరిగ్గా 100 రోజులు పూర్తయ్యాయి. ఇందులో బాబు విశ్రాంతి తీసుకున్న రోజులు,
ఎర్రన్నాయుడు హఠాన్మరణం నేపథ్యంలో పరామర్శకు వెళ్లిన రోజులూ ఉన్నాయి.
Posted by
arjun
at
6:03 AM