January 10, 2013
అండగా ఉంటా ఆశీర్వదించండి

ర్రాష్టాన్ని టీడీపీ హయాంలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాలను
అన్నిరంగాల్లో అభివృద్ధిచేశామని కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుం టుపడిందని టీడీపీ అధినేత
నారాచంద్రబాబునాయుడు అన్నారు. 'మీ కోసం వస్తున్నా' యాత్ర బుధవారం మండలంలోని మాదిరిపురం,
సుబ్లేడ్, హస్నాబాద్‌లలో కొనసాగింది. ఈసందర్భంగా సుబ్లేడ్ క్రాస్‌రోడ్డు, సుబ్లేడ్
గ్రామంలోని గాంధీసెటర్, ఎస్సీ కాలనీలో జరిగినసభలో చంద్రబాబు మాట్లాడారు.
రాష్ట్రంలో రాక్షసపాలన రాజ్యమేలుతోందని కాంగ్రెస్ పానలకు చరమగీతం పాడాలని
కో రారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. విత్తనాలు, ఎరువులు,
పురుగుమందులధరల పెరుగుదలతో రైతులు వ్యవసాయంసాగుచేసే స్థితిలోలేరన్నారు. ప్రభుత్వ విధానాల
వల్ల రైతాంగం గిట్టుబాటుధరలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతు ప్రభుత్వమని
గొప్పలు చెప్పకుంటున్న కాంగ్రెస్ వారి కంట కన్నీరు కారిస్తోందని విమర్శించారు. విద్యుత్
కోతలు, నీలంతుపాన్ తో పంటలు ఎండిపోయాయని అయినా ప్రభు త్వం రైతులను ఆదుకోలేదని అన్నారు.
విద్యుత్ సర్‌చార్జీలపేరుతో ప్రభుత్వం 31వేల కోట్ల భారాలను ప్రజలపై మోపేందుక సిద్ధంగా
ఉందని అన్నారు. టీడీపీ హయాంలో అనేక విద్యుత్‌ఖ సంస్కరణలు పెట్టి మిగులు విద్యుత్‌ను
అందించామని నేడు ఆపరిస్థితిలేదని అన్నారు. డ్వాక్రా మహిళలు సామాజికి, ఆర్థికంగా ఆదుకోవానలే
లక్ష్యంతోటీడీపీ ప్రభుత్వం వారికి అనేక పధకాలు ప్రవేశపెట్టామని అన్నారు. కాంగ్రెస్
ప్రభుత్వం వాటిని రద్దు చేస్తోందని అన్నారు.
పడకేసిన ప్రాజెక్టులు
జిల్లాలో తీవ్ర కరువుపీడిత ప్రాంతమైన తిరుమలాయపాలం మండలానికి శాశ్వత సాగునీరు
అందిచాలనే లక్ష్యంతో చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవదశ పనులు ముందుకుసాగడంలేదని
చంద్రబాబు ఆన్నారు. రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కునివారికి పరిహారం కూడా ఇవ్వలేదని,
అన్నారు. పేదరికంలేని సమాజ స్థాపనంకోసం తన జీవితాశయమని అవినీతి రహిత సమాజస్థాపన కోసం
కృషిచేస్తానని తెలిపారు. ర్రాష్టాన్ని ముందుకుతీసుకెళ్లేందుకు యువత అవినీతిపై పోరాడాలన్నారు.
పింఛన్ సొమ్ము పెంచుతాం..
వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులుకు టీడీపీ అదికారంలో వస్తే పెన్సన్
6వందలు ఇస్తామని ప్రతి ఒక్కరికి లక్షరూపాయలు ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని చంద్రమాబు
హామీ ఇచ్చారు. ఈసందర్భంగా సుబ్లేడ్ లో స్థానిక సమస్యలపై చంద్రబాబు దృషిటకితీసుకొచ్చారు.
సుబ్లేడ్‌నండి గుండెపుడి వరకు రోడ్డునిర్మించాలని, ఎస్సీకాలనీలోఅంతర్గత, సీసీ రోడ్లు
నిర్మాంచాలని , కమ్యూనిటీహాల్ నిర్మించాలని తెలిపారు.
ఒక బల్బుకు వేలల్లో బిల్లు..
విద్యుత్ బిల్లులుఅధికంగా వస్తున్నాయని రెండు నెలలకు 1400రూపాయలు అగస్టీన్
అనే గ్రామస్థుడు చంద్రబాబుకు తెలిపారు. ఒక బల్బు ఉంటే 2600 బిల్లు వచ్చిందని వినయ్
తెలిపారు. ఈ పాదయాత్రలో ఖమ్మం ఎంపీ నామనాగేశ్వరరావు, టీడీప అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు,
ఎమ్మెల్యేలు తుమ్మలనాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారయణ,
పోట్ల నాగేశ్వరరావు, మహిళనాయకురాలు స్వర్ణకుమారి, జోగుపర్తి వెంకటేశ్వర్లు, బత్తుల
రాములు, కృష్ణచైతన్యపాల్గొన్నారు.
Posted by
arjun
at
12:16 AM