
తెలంగాణాకు బీజం వేసింది రాజశేఖర్ రెడ్డేనని
అన్నారు. తెలుగుదేశంను దెబ్బతీయడానికి దొంగమార్గాలు తప్ప రాజమార్గంలో
వెళ్ళడం తనవల్ల కాదని, తొలుత సోనియా దగ్గరకు ఎమ్మెల్యేలను పంపాడు, తరువాత
2004 లో సోనియాతో టీఆర్ఎస్ కండువా వేయించి, సోనియాతో జై తెలంగాణా అని
చెప్పించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టించాడన్నారు.
ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పూటకో మాట ప్రజలకు చెబుతోందని ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్ పార్టీ జైలు నుంచే నడుస్తోందన్నారు. జైల్లో మాట
లు, బయట మూటలు,
చెప్పేది మాత్రం నీతులు అని విమర్శించారు. ఎన్టీఆర్‌తో పాటు తాను
నిజాయితీగా వ్యవహరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచామన్నారు. సింగపూర్
అభివృద్ధి చెందటానికి 50 ఏళ్ళుపడితే, తాను హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా
తొమ్మిది ఏళ్ళలో మార్చానన్నారు. జగన్ ఆరోగ్యం ఎలా ఉందని రాష్ట్రపతి, ప్రధాన
మంత్రి అడిగారని ఆయన తల్లి విజయలక్ష్మి స్వయంగా చెప్పారని, ఇది
దేశద్రోహులను, నేరగాళ్ళను ఈ దేశ అత్యున్నత అధికార వ్యక్తులు సమర్ధించటం
కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్షాత్తు సీబీఐ 45 వేల కోట్లు ఆర్ధిక
నేరం జరిగిందని అభియోగం మోపిన వ్యక్తుల పట్ల ఈ ఇద్దరు నాయకులు శ్రద్ధచూపటం
దేనికి సంకేతం అన్నారు. కాంగ్రెస్, వై.సి.పి రెండూ కలిసి నాటకం
ఆడుతున్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోందన్నారు.దేశద్రోహులన్న ఉగ్రవాదులను
ఉరితీశారు. జగన్ లాంటి ఫ్యాక్షనిస్టులు, ఆర్ధిక ఉగ్రవాదులకు మాత్రం ఈ
కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో రాజభోగాలు అందించటం సిగ్గు చేటన్నారు.