September 8, 2013
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారే

మీకు న్యాయం చేస్తాను: చంద్రబాబు
రైతులు విన్నపాలపై చంద్రబాబు స్పందిస్తూ ఒకరికి న్యాయం చేయమం టే మరోకరికి పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏధైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటారు. కానీ కాంగ్రెస్ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందున్నారు. సీమాం«ద్రుల హక్కుల్లో నీటి సమస్య కూడా ఒక భాగమన్నారు. మీ సమస్యలన్నింటిని పరిష్కరించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
భక్షి సిఫార్సులపై
చంద్రబాబుకు వినతి పత్రం
కో ఆపరేటివ్ సొసైటిల మనుగడ ప్రశ్నార్థకంగా మారే డాక్టరు ప్రకాష్ బక్షి సిఫార్సులను వ్యతిరేకించి రైతాంగానికి న్యా యం చేయాలని చలసాని ఆంజనేయులు, చంద్రబాబుకు సూరంపల్లిలో వినతిపత్రాన్ని అందజేశారు. ఆస్తులు, అప్పులు, షేరుధనం, బదలాయించడం వల్ల వివిధ సంఘాల నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. రైతుల కోసం గ్రామీణ స్థాయిలో ఏర్పడిన సంఘాలు ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంది. బక్షి కమిటీ నివేదిక అమలు నిలుపుదలకు కృషిచేయాలని వినతి పత్రంలో కోరారు.
Posted by
arjun
at
9:24 AM