September 8, 2013
చంద్రబాబు ప్రచారరథానికి షార్ట్‌సర్క్యూట్

ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో యాత్రకు బయలుదేరటానికి సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు ప్రసంగించే ప్రచార రథంలో మైక్‌లను సరిచేస్తుండగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి పొగలు లేచాయి. దీంతో క్యాంపులో కలకలం రేగింది. దానికి సమీపంలోనే మరోబస్సులో చంద్రబాబు విడిది చేసి ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే పొగలు లేచాయని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే వాహనంలో ఏర్పడిన లోపాన్ని టెక్నీషియన్లు సరిచేశారు. అనంతరం చంద్రబాబు ప్రచారథం ఎక్కి ఆత్మగౌరవయాత్రకు బయల్దేరి
వెళ్ళారు.
Posted by
arjun
at
9:16 AM