September 8, 2013
సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తే మూడు రోజులలో సమస్య పరిష్కారం : సుజనా చౌదరి
తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి సమైక్య రాష్ట్రం యధాతధంగా
కొనసాగడానికి ఒక సలహా ఇస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ పదవులకు
రాజీనామా చేస్తే మూడు రోజులలో సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెబుతున్నారు.
సీమాంధ్ర ఉద్యమంపై కేంద్ర మంత్రులకు,ఎమ్.పిలకు చిత్తశుద్ది లేదని ఆయన
అన్నారు.తెలుగు ప్రజలను నిలువుగా చీల్చడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన
అంటున్నారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచన రహితంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల
ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.తాము
పార్లమెంటులో చేసిన ఆందోళనకు సీమాంధ్ర ఎమ్.పిలు తగు సహకారం అందించలేదని,
వారిని చరిత్ర క్షమించదని ఆయన అన్నారు.
Posted by
arjun
at
9:13 AM