September 26, 2013
సోనియా దర్శకత్వంలో ...‘జగన్ జైలుకు దారేది’పూర్తి !!!
గురువారం ఎన్టీర్ భవన్‌లో పత్రికా ప్రతినిధులతో రామయ్య మాట్లాడుతూ అత్తారింటికి (జైల్‌కు)దారేది సినిమా బాగా ఆడుతుందని భావించినా పైరసీ దెబ్బతో ప్లాఫ్ అయి, డీలా పడ్డాడని తెలిపారు. ఇక నుంచి సోనియా డైరెక్షన్ లేకుండా జగన్ యాక్షన్ చేయగలనని ధైర్యంగా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కడప, ఢిల్లీకి మధ్య, ఇడుపులపాయకు, 10జన్‌పథ్‌కు మధ్య, సోనియాకు, జగన్‌కు మధ్య పోటీ అని వైకాపా నేతలు, విజయమ్మ చెప్పగలరా అని ప్రశ్నించారు.
బుధవారం రాత్రి వరకు తమ రాజీనామాను గురువారం ఆమోదించుకుంటామని చెప్పిన వైకాపా, తెల్లవారే సరికి ప్లేట్ ఫిరాయించారని, సోనియా సూచనల మేరకు శాసన సభను సమావేశ పరచమని వైకాపా నేతలు కోరుతున్నారని తెలిపారు.సోనియా ఆడుతున్న నాటకంలో జగన్, వైకాపాలు పాత్రదారులని తెలిపారు. సోనియా చేతిలో జగన్ భవిష్యత్ ఉందన్నారు.అందుకే సోనియా చెప్పినట్లు జగన్ నడవాల్సిందేనన్నారు.
ఈ విషయాన్ని రాష్ర్ట ప్రజలు అర్ధం చేసుకున్నారని రామయ్య తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలకే పరిమితమైన జగన్ సమైక్య వాదినని ఎలా చెప్పగలడన్నారు. విభజనకు బాటలు వేసిందే వైకాపా వారని, ఇప్పుడు సమైఖ్యమని డ్రామాలు ఆడుతున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల నేత అశోక్ బాబుకు కోపం వస్తుందన్న భయంతో జగన్ సమైక్య బాట పట్టారని విమర్శించారు. రాజినామాలు ఇచ్చిన మీరు, అసెంబ్లీని సమావేశ పరచమని ఏ ముఖ్యం పెట్టుకొని అడుగుతారని ఆయన ప్రశ్నించారు. సోనియా డైరెక్షన్ ప్రకారమే అసెంబ్లీలో తీర్మానం పెట్టమని అడుగుతున్నారని తెలిపారు.అసెంబ్లీలో ఏ తీర్మానం జరిగినా రాష్ట్ర విభజన ఖాయమని కాంగ్రెస్ పెద్దలు చెపుతున్నారని రామయ్య తెలిపారు.ఇలాంటి సమయంలో అసెంబ్లీని సమావేశ పరచాలని జగన్ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు.సోనియాకు పెద్దకొడుకు కెసిఆర్, చిన్నకొడుకు జగన్ అని, కాంగ్రెస్ రాష్ట్రంలో బ్రతికి బట్టకట్టదని తెలసుకున్న సోనియా కెసిఆర్, జగన్‌లతో క్విడ్‌ప్రోకోకు పాల్పడుతుందన్నారు.
తెలుగు దేశం బలపడితే తన ఆటలు సాగవని సోనియా ఈ కుట్రలకు పాల్పడుతుందని తెలిపారు.తనను ఆదు కుంటాడనే సోనియా జగన్‌ను బైటకు తీసుకు వచ్చిం దన్నారు.జగన్ బైటకు రావటంలో కోర్టులది తప్పులేదని, సీబీఐ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయన్నారు. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ ఏమాత్రం కోర్టును అడగలేదన్నారు.సీబీఐ తన స్థాయిన దిగజార్చుకుందని రామయ్య తెలిపారు.గతంలో జగన్ అ్ర మాస్తులు కేసులో సూట్‌కేసు కంపెనీలు ఉన్నాయని చెప్పిన మీరు, ఆ కంపెనీ సూట్‌కేసులను 10జన్‌పథ్‌కు, లోటాస్ పాండ్‌కు పింపించారా అని రామయ్య ప్రశ్నించారు.
రాజ్యాంగం, చట్టం,న్యాయం ప్రకారం సీబీఐ దర్యాప్తు చేయలేదన్నారు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు లగ్జంబర్గ్‌లో నెలకొల్పిన ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్షన్,సికార్ సంస్థ కోటి రూపాయలతో ప్రారంభించి, 5 సంవత్స రాలలో వెయ్యి కోట్లు రూపాయలు ఎలా సంపాదించారో తెలపాలన్నారు.సీబీఐ దర్యాప్తు కోరిన వెంటనే ఆ కంపెనీని మూసివేశారని తెలిపారు. మారిషన్‌లోని 2కంపెనీ క్యాపిటల్ ప్లూరీ ఎమర్జింగ్ కంపెనీల నుండి నేరుగా 1246 కోట్లు జగన్ కంపెనీలోకి వచ్చాయన్నారు.ఇలాంటి కంపెనీల మీద సీబీఐ దర్యాప్తు చేయాల్సిన బాధ్యత లేదా అని రామయ్య ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో కిరణ్ అసమర్ధ పాలన మూలంగా ప్రజలు అనేక ఇబ్బందుల పడుతున్నారని తెలిపారు.
వర్ల రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది మామూలు సినిమా కాదని, సోనియా గాంధీ దర్శకత్వంలో.. అదిభయంకర చోర సామ్రాట్ వైఎస్ జగన్ హీరోగా నటించగా, విలన్‌గా నటబీభత్స అంబటి రాంబాబు, కథ దిగ్విజయ్ సింగ్, స్క్రీన్‌స్లే అహ్మద్ పటేల్, ఎగస్ట్రా ఆర్టిస్టులుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు నటించగా, ప్రత్యేక క్యారక్టర్ ఆరిస్టు, ఏ పార్టీలోనైనా ఇమిడి పోగల శోభానాగిరెడ్డితో చంచల్‌గూడ జైల్, లోటాస్‌పాండ్, టెన్‌జన్‌పథ్, ఇడుపుల పాయ, నాంపల్లి తదితర ప్రాంతాలలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో, 16 నెలలుగా నిరంతరం షూటింగ్ నిర్వహించిన అద్బుతమైన సినిమా పైరసీ బారిన పడిందని, సోనియా, జగన్ డీల్‌ను తెలుగు దేశం పార్టీ బైట పెట్టింద వర్ల తెలిపారు.
Posted by
arjun
at
10:56 PM