యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కనుసన్నల్లో దిగ్విజయ్,
మొయిలీ నడుస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. బొత్స, జగన్
కుట్ర చేస్తున్నార ని మండిపడ్డారు. జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు
చేస్తామని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని
వెల్లడించారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని దేవినేని
ప్రకటించారు.