September 27, 2013
కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించుకునేవాళ్లని అయితే
రాజీనామాలపై ఏబీఎన్‌లో వచ్చిన కథనంతో వైసీపీ తోకముడించదని టీడీపీ నేత
దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతితో
మాట్లాడుతూ తెలుగు జాతిని చీల్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు అని ఆయన
ప్రశ్నించారు.
దొంగలంతా కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీలు చవట దద్దమ్మలని దేవినేని మండిపడ్డారు. కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు చేతులు కాలాక ఇవాళ ఏడిస్తే ఏం లాభమని దేవినేని ఎద్దేవా చేశారు.
Posted by
arjun
at
6:43 AM