September 28, 2013
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది............
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని మైలవరం ఎమ్మెల్యే, కృష్ణా
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు
విమర్శించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు
కార్యాలయంలో శనివారం టీడీపీ జిల్లా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ, చిరంజీవి మాదిరిగానే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి దాసోహం అయ్యారన్నారు. ఫలితంగానే ఆయనకు బెయిలొచ్చిందని లోకం కోడై కూస్తోందన్నారు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టే సమైక్య సంగతులు చెబుతున్న జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలసి పోవడం ఖాయమన్నారు.
Posted by
arjun
at
8:28 PM