September 28, 2013
అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా ..........
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే కాంగ్రెస్సే అని, సీఎం
కిరణ్‌ను హైకమాండ్ నడిపిస్తోందని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి
దయాకర్‌రావు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇరుప్రాంతాలను
రెచ్చగొట్టే విధంగా కిరణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌ను
వెంటనే బర్తరఫ్ చేయాలని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సీఎంపై కేసు
పెట్టి అరెస్ట్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆరోపించారు. అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆనాడు రోశయ్యతో ఈనాడు కిరణ్‌తో కాంగ్రెస్ డ్రామాలాడిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే సీఎం కిరణ్, బొత్సలను బహిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
7:09 AM