September 28, 2013
కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోంది........
విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని
బహిరంగంగా ధిక్కరిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం కిరణ్‌పై ఎందుకు మౌనం
వహిస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు
ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ గేమ్
ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ తామే ఇస్తున్నట్లు ఇక్కడ ప్రచారం చేస్తూ తామే
అడ్డుకుంటున్నట్లు సీమాంధ్రలో ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తున్నారు' అని
విమర్శించారు. 'సీఎం ప్రజలను రెచ్చగొడుతున్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న
ఆయనపై చీటింగ్ కేసుపెట్టి అరెస్టు చేయాలి. ఆయన చెప్పే అంశాలపై శ్వేతపత్రం
విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను
పెట్టుకొని ఆటాడిస్తోందని విమర్శించారు.
Posted by
arjun
at
8:30 PM