September 14, 2013
ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ స్వరూపం బయట పడుతుందని వాటి భయం
చంద్రబాబు నాయుడు కాలు కదిపితే వైసీపీ, టిఆర్ఎస్
పార్టీలకు వణుకు వస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల
కేశవ్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
'చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకొంటున్నానని అనగానే ఈ పార్టీలు
గడగడలాడుతున్నాయి. ఆ యాత్రకు రకరకాల కారణాలు ఆపాదిస్తూ నోటికి వచ్చినట్లు
మాట్లాడుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ
స్వరూపం బయట పడుతుందని వాటి భయం. రాష్ట్రంలో రగులుతున్న మంటలను ఆర్పి
అందరికీ న్యాయం చేయమని చంద్రబాబు కోరుతున్నారు. దానికి వీరికేమిటి బాధ? ఇరు
పక్కలా ప్రజలను రెచ్చగొట్టి ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పి పబ్బం
గడుపుకోవాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సమస్యలు పరిష్కారమైతే తమ
పబ్బం గడవదని వీటి భయం. అందుకే బాబును తిటి ్ట పోస్తున్నాయి' అని ఆయన
విమర్శించారు.
Posted by
arjun
at
8:18 PM