September 15, 2013
చంద్రబాబు నాయుడు వైఖరి కరక్టే : డాక్టర్ ఎన్.శివప్రసాద్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒక నాయకుడిగా రెండు ప్రాంతాలలో
పార్టీని రక్షించుకునే విదంగా ముందుకు వెళుతున్నారని టిడిపి ఎమ్.పి డాక్టర్
ఎన్.శివప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమని కొందరు
బిజెపి,కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, నిజంగానే విభజన అనివార్యమైతే రెండు
ప్రాంతాల ప్రయోజనాలను కాపాడడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని
అన్నారు. అందుకే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరుతున్నారని చంద్రబాబు
వైఖరిని శివప్రసాద్ సమర్ధించారు.అయితే తాను సమైక్యవాదినని మాత్రం ఆయన
స్పష్టం చేశారు.తమ పార్టీ ఏకపక్షంగా విబజన కోరినట్లు దుష్ప్రచారం
చేస్తున్నారని,కాని తమ పార్టీ సమన్యాయం కోరుతోందని,పార్టీ తీర్మానం చూస్తే
అర్దం అవుతుందని ఆయన అన్నారు.
Posted by
arjun
at
12:22 AM