September 14, 2013
లేఖ ఇస్తే సమైక్యాంధ్ర ప్రకటిస్తారా?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ
అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇస్తే విభజనను కేంద్రం ఆపేస్తుందా అని
టీడీఎల్పీ ఉప నేత, నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు.
తిరుపతిలోని పూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రజకులు
చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
దీక్షా శిబిరం వద్ద దుస్తులను ఇస్త్రీ చేస్తూ వారికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. రెండు ప్రాంతాల ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని చంద్రబాబు లేఖ రాస్తే.. రాష్ట్రాన్ని విభజించాలని ఆయన కోరినట్లు కాంగ్రెస్, వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. దీన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను వదలి టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బీసీలంతా ఒకతాటిపైకి రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడానికి చంద్రబాబు కృషే కారణమన్నారు.
Posted by
arjun
at
7:06 AM