August 9, 2013
నచ్చకుంటే రాజీనామా ముఖాన కొట్టు: కిరణ్‌కు తలసాని
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
రెడ్డికి నచ్చకుంటే రాజీనామా వారి ముఖాన కొట్టాలని లేదంటే వారి పార్టీ
అధిష్టానంతో పొట్లాడాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగర
అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు. తమ పార్టీ
తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడో లేఖ ఇచ్చిందన్నారు. కాంగ్రెసు
పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని... ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలతో కొత్త
డ్రామా ఆడిస్తోందని విమర్సించారు. హైదరాబాదు పైన మాట్లాడే హక్కు తమకు
మాత్రమే ఉందని, ఎవరికి లేదన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా
చేస్తే ఒప్పుకునేది లేదన్నారు.
Posted by
arjun
at
7:13 AM