August 9, 2013
కాంగ్రెస్ ఆటలాడుతోంది : ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆటలాడుతోందని టీ టీడీపీ నేత
ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఇవాళ ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో
మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఓ
వైపు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ, ఓ వైపు అణగదొక్కారని తెలిపారు. కాంగ్రెస్
పార్టీ నియమించిన హైలెవల్ కమిటీ ఎవరి కోసం అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో
తెలంగాణ బిల్లు పెడుతామని ఇంత వరకు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు.
తెలంగాణను అడ్డుకోవాలని కేంద్రం యత్నిస్తుందని, అందులో భాగంగానే
కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని ఎర్రబెల్లి
చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు చాలా కృషి చేశారని కొనియాడారు.
హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబుతోనే
సాధ్యమైందన్నారు.
Posted by
arjun
at
7:14 AM