August 9, 2013
కెసిఆర్ తప్పుడు కూతలు: దేవినేని
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పుడు
కూతలు కూస్తున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
విజయవాడలో అన్నారు. విభజన విషయంలో డ్రామాలు వేస్తున్న కాంగ్రెసు పార్టీ
నేతలు తమను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రజా ఉద్యమంలో తామే
ముందుంటామన్నారు. సమైక్యాంధ్ర తమ గుండె చప్పుడు అన్నారు. నీళ్లు, నిధులు,
సీమాంధ్ర హక్కులపై పోరాడుతామన్నారు. ఇష్టారీతిగా మాట్లాడే కెసిఆర్ వంటి
వారిని డిజిపి ఏమనరని, అదే సీమాంధ్రులను మాత్రం హెచ్చరించడమేమిటిన్నారు.
తమపై తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ
విభజన విషయంలో విడ్డూరంగా మాట్లాడుతోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
రెడ్డిది వాదమైతే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరోలా
మాట్లాడుతున్నారన్నారు. తెరాసను విలీనం చేసుకుని లబ్ధి పొందాలనే
దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెసు విభజన చేసిందన్నారు. డిజిపి దినేష్ రెడ్డి
సమైక్యవాదేనని, తెలంగాణలో నలభై శాతం మంది సమైక్యవాదులు ఉన్నారని మరో నేత
కోడెల శివప్రసాద రావు అన్నారు.
Posted by
arjun
at
7:12 AM