July 2, 2013
10 రోజుల్లో తెలంగాణ ప్రకటన చేయాలి : ఎర్రబెల్లి
తెలంగాణ ఏర్పాటుకు ఇదే కీలకమైన సమయం అని, 10 రోజుల్లో
10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటన చేయాలని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్
ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పనైపోయిందని
ఆయన అన్నారు. ఈనెల 7న టీడీపీ ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్నట్లు
ఎర్రబెల్లి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం
నిర్వహిస్తున్నట్లు ఎర్రబెల్లి వెల్లడించారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
Posted by
arjun
at
6:37 AM