July 2, 2013
తల్లి,పిల్ల కాంగ్రెస్ ఒకటే అని చెప్పకనే చెప్పారు : యనమల
తల్లి, పిల్ల కాంగ్రెస్ ఒకటే అని దిగ్విజయ్‌సింగ్
చెప్పకనే చెప్పారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం ఉదయం
మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసేందుకు భారతి,
సుబ్బారెడ్డి ప్రయత్నించిన మాటా వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ
పరిస్థితి పీఆర్పీ కంటే దారుణంగా తయారైందన్నారు. వైసీపీకి తెలుగువారి
క్షేమం కంటే వైఎస్ కుటుంబ సంక్షేమమే ముఖ్యమని, వరదబాధితులను ఆదుకోవలనే
ఇంకిత జ్ఞానం కూడా లేదని యనమల విమర్శించారు.
Posted by
arjun
at
6:38 AM