June 8, 2013
వైఎస్ భారతి ప్రజలకు క్షమాపణ చెప్పాలి : వర్లరామయ్య
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై
టీడీపీ నేత వర్లరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని,
రాష్ట్రాన్ని, న్యాయవ్యవస్థను కించపర్చేలా భారతి మాట్లాడారని, ప్రజలకు ఆమె
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులపైనే చేయి చేసుకుంటారా అని
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటే భారతికి విలాసవంతమైన
భవనాలు వచ్చాయని, వైఎస్ సీఎం కాకపోతే లోటస్‌పాండ్‌లో భవనం కట్టేవారా అని
ప్రశ్నించారు. జగన్ చేసిన నేరాలకు చైనాలో ఉరితీసేవారన్నారు. 2004లో ఏమీ
లేని జగన్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. వైఎస్ కుటుంబానిది మొత్తం
నేర చరిత్ర కాదా అని వర్లరామయ్య పేర్కొన్నారు.
Posted by
arjun
at
6:26 AM