హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి
ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డులో సేవలు అందిచడం లేదంటూ నన్నపనేని
పేర్కొన్నారు. మెదడు సంబంధిత వ్యాధితో కోమాలోకి వెళ్లిన యువకుడికి మెరుగైన
వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు మాత్రం
పట్టించుకోవడం లేదని నన్నపనేని ఆరోపించారు.