హైదరాబాద్ : ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని టీడీపీ ఎమ్మెల్యే
గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. శాసనసభలో సరైన చర్చ జరపకుండా
ప్రభుత్వం పారిపోతుందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. స్పీకర్ అధికార
పక్షానికి వంత పాడుతూ వాయిదా మంత్రాన్ని ఎంచుకున్నారని గాలి
ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు.