June 19, 2013
వైకాపా, కాంగ్రెస్ విలీనం ఖాయం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు త్వరలోనే విలీనమవుతాయని
దూళిపాళ్ల నరేంద్ర జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీల పనితీరును ప్రజలు
గమనిస్తున్నారని ఆయన అన్నారు. జంట కాంగ్రెస్‌లు కుమ్మక్కై అసెంబ్లీ లోపల
వెలుపల పనిచేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ అసెంబ్లీ వద్ద
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐఎంజి భూ కేటాయింపులపై పదేళ్ల తర్వాత
డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏమి చేశారని
ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశ, దశ లేకుండా నడుస్తోందని, ఆ
పార్టీ వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో కలవడం తథ్యమని అన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు త్వరలోనే విలీనమవుతాయని దూళిపాళ్ల నరేంద్ర జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీల పనితీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. జంట కాంగ్రెస్‌లు కుమ్మక్కై అసెంబ్లీ లోపల వెలుపల పనిచేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ అసెంబ్లీ వద్ద విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐఎంజి భూ కేటాయింపులపై పదేళ్ల తర్వాత డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏమి చేశారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశ, దశ లేకుండా నడుస్తోందని, ఆ పార్టీ వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో కలవడం తథ్యమని అన్నారు.
Posted by
arjun
at
11:04 PM