June 19, 2013
కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావు కుటుంబ
సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి
దయాకర్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేస్తున్న
భూకబ్జాలు, సెటిల్ మెంట్లను నిరసిస్తూ గురువారం నగరంలోని గన్ పార్క్ వద్ద
టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి
ప్రసంగిస్తూ... తెలంగాణ ప్రజలను రాజకీయ నేతలు మోసం చేస్తున్నారని
ఆరోపించారు. రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన
వ్యక్తం చేశారు.
Posted by
arjun
at
11:02 PM