April 23, 2013
కాంగ్రెస్‌లో ఉంటే జైలుకెళ్లేవాడినే : మాగంటి బాబు
జంగారెడ్డిగూడెం : 'కాంగ్రెస్ నుంచి తప్పుకున్నందుకే నేను
జైలు పాలుకాలేదు.. జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క స్థానం ఓడినందుకు వైఎస్
నన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు.. నేను ఆ పార్టీలో ఉంటే జైలుకెళ్లే
వాడిని.. జగన్ పక్కన చంచల్‌గూడ జైల్లో నాక్కూడా ఖైదీ నెంబర్ 786 లేదా 420
ఇచ్చేవారని' టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బయ్యారం, ఓబుళాపురం గనులు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి వైఎస్ కుటుంబం కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడిందన్నారు.
Posted by
arjun
at
1:12 AM