
బొబ్బిలి: కాంగ్రెస్ హయాంలో మ హిళలకు
ఇంటా, బయటా రక్షణ లేకుం డా పోయిందని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు
తూముల అచ్యుతవల్లి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కా ర్యాలయంలో ఆమె
విలేఖర్లతో మాట్లాడుతూ ఢిల్లీలోని నిర్భ య సంఘటన దేశ ప్రజలు మరువక ముందే,
ఐదేళ్ల చిన్నారిపై అతి దారుణంగా మానవమృగం పైచాచికంగా ప్రవర్తించిన తీరు ఈ
ప్రభుత్వాల చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు.
అట్టహాసంగా నిర్భ య
చట్టాన్ని రూపొందిచామని, బాధితులను శిక్షిస్తామని చెబుతున్న ఈ
ప్ర భుత్వం
ఢిల్లీలో చిన్నారిపై జరిగిన సంఘటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళలపై పోలీసుల
దాడిని ఏమనాలని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం నేరస్థులను పట్టుకొని కఠినంగా
శిక్షించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి
సంఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. ఇలాంటి పాలకులను దేశం నుంచి
తరిమివేయాలన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పువ్వల
శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షుడు వెంకట్, తెలుగు మహిళా నాయకురాలు
శ్రీదేవి పాల్గొన్నారు.