
పాతపట్నం: తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర
నిర్వహిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు, మచిలీపట్నం ఎంపీ
కె.నారాయణరావు తెలిపారు. పాతపట్నంలోని జిల్లా పరిషత్ విశ్రాంత భవన
ప్రాంగణంలో బుధవారం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం
లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు
మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల అభీ ష్ట్టం మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జి
చంద్రబాబు పాదయా త్ర ముగిసిన అనంతరం నియమించనున్నట్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీను ప్రజలు
విశ్వసించే స్థితిలో ప్రజలు లేరన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ
నియోజకవర్గ ఇన్‌చార్జి రా మ్మోహన్‌నాయుడు,పాతపట్నం నియోజకవర్గంలోని మం డలాల
నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.