April 25, 2013
జగన్ ఆస్తులను జప్తు చేయాలి: చంద్రబాబు

గురువారం విశాఖ జిల్లా సబ్బవరం సమీపంలో జరిగిన ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రంలో జరిగిన వనరుల దోపిడీ దేశంలో మరెక్కడ జరగలేదన్నారు. అక్రమాస్తుల కేసుల్లో జైలులో వున్న జగన్ అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులను జప్తు చేస్తే భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడరని ఆయన అభిప్రాయపడ్డారు.
Posted by
arjun
at
7:32 AM