April 19, 2013
ఇన్‌చార్జీల నియామకంపై అబిప్రాయాల సేకరణ
మాకవరపాలెం/విశాఖపట్నంతొలుత పాడేరు నియోజకవర్గానికి చెందిన మణికుమారి, ఎంవీఎస్‌ప్రసాద్, బొర్రా నాగరాజు, షేక్‌భాషా, మహేశ్, ఎం.అచ్చిరాజు, బి.చినరామ్మూర్తి, ఆర్.రాము, ఎం.రమణమ్మ, తదితరులతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు. నెలరోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతనే సమన్వయకర్త నియామకం చేపడతామని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు కోరినట్టు మణికుమారి తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మాజీఎంపీ పప్పల చలపతిరావు నేతృత్వంలో కాకర నూకరాజు, రెడ్డి రామకృష్ణ, లాలం కాశీనాయుడు, వేజర్ల వినోద్, కె.వెంకటేశ్వరరావు, బొల్లం బాబ్జీ, పెదవరపు శివ, తదితరులు 18మంది సభ్యులుగా గల కమిటీని ఏర్పాటు చేశారు.
వారంరోజులపాటు వీరిని నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు పరిశీలించి నివేదిక అందజేయాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వారిని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలని వారిని కోరారు. వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు
Posted by
arjun
at
7:39 AM