April 19, 2013
జన్మదిన వేడుకలకు బాబు దూరం

నిజానికి.. విశాఖపట్నం జిల్లా కన్నూరుపాలెంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు భారీ సన్నాహాలు చేశారు. పాదయాత్రగా బాబు ఈ గ్రామం చేరుకోగానే.. ఎదురేగి శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు అగ్రనేతలు ఇప్పటికే కన్నూరుపాలెం చేరుకున్నారు. కాగా బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో శనివారం ఉచిత నేత్ర పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు.
Posted by
arjun
at
9:57 PM