April 19, 2013
సీఎం నేవ్వే బాబూ..

దారిపొడవునా మహిళలు చంద్రబాబుకు హారతులుపట్టి తిలకం దిద్దారు. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు తమ భవిష్యత్తు గురించి చంద్రబాబు వద్ద ఆందోళన వ్యక్తం చేసి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం విశేషం. తిరిగి మీరు ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగ యువత, డ్వాక్రా మహిళలతోపాటు వృద్ధులు సైతం పేర్కొనడంతో చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
పాదయాత్రలో భాగంగా గురువారం తన ప్రసంగాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా వాటి పరిష్కారానికి భవిష్యత్‌లో ఏం చేయాలనేది ఒక అవగాహన వస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారంనాటి పర్యటనలో బీ
సీలకు ప్రాధాన్యం ఇస్తూ 50 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళిక, అదేవిధంగా క్రీడాకారులకు, మహిళలకు, చేతివృత్తులవారికి తగిని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన పథకాలను చంద్రబాబు ప్రకటించారు.
ఖనిజ దోపిడీకి పాల్పడుతున్న పాలక పెద్దలు, రైతులు, ప్రజలకు అవసరమైన తాగు, సాగునీటిని కూడా దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న అన్‌రాక్‌పై తగు చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబ అవినీతిని సామాన్య ప్రజల కష్టాలతో పోలుస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది.
Posted by
arjun
at
7:40 AM