
హైదరాబాద్ అలాగే..అర్చకుల పదవీవిరమణ వయసును పెంచుతామని చంద్రయ్యపాలెంలో తనను కలిసిన
రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. బ్రాహ్మణుల
ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు; ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
బ్రాహ్మణులు సైతం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని, నాయకులుగా ఎదగాలని
కోరారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టే ఆ లోచన
ఉందని చెప్పారు.
: అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన పేద
బ్రాహ్మణులకు 'ఆయుష్మాన్‌భవ' పథకం కింద 1000 రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ
అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సామాజికవర్గం సంక్షేమానికి
రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.