
ఏ పార్టీకైనా
పునాదే కీలకం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పటిష్టత కోసం ముందు నుంచీ పని చేసిన
వారెందరో ఈ జిల్లాకు చెందిన వారున్నారు. పార్టీ ఆవిర్భావంలో ఎన్టీ
రామారావు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి దశదిశలా వ్యాపించడంలోనూ ఈ జిల్లా
ప్రధాన భూమిక పోషించింది. టీడీపీ ఏర్పాటుచేశాక పార్టీలో చేరి పని చేయడమే
కాదు... పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచీ ఈ జిల్లాలో ఎన్టీఆర్‌కి సలహాలు
ఇచ్చిన రాజకీయ దురంధరులు ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తారని
తెలుసుకుని ఆయన అభిమాన సంఘం నాయకుడు గోరంట్ల రాజేంద్రప్రసాద్ రాజమండ్రిలో
పెద్ద సభ నిర్వహించారు. అశోక థియేటర్‌లో జరిగిన ఈ సభకు రిక్షా, జట్టు
కార్మికులు వేలాదిమందిగా హాజరయ్యారు.
అన్నగారు పెట్టే పార్టీకి మనం
అండగా ఉండాలంటూ పాతికేళ్ల యువకుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఇచ్చిన
మూడు దశాబ్దాలుగా అదే పార్టీలో...
ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి మూడు, నాలుగు పార్టీలు మారే నేతలు ఉన్నారు.
కానీ టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలోనే కొనసాగుతున్న నేతలు అనేక మంది
ఇక్కడ ఉన్నారు. యనమల, చిక్కాల, గోరంట్ల, గన్ని తదితర నేతలు ఇప్పటికీ
తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. నాయకులకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ
వేలాది మంది కార్యకర్తలు టీడీపీకి అండగా ఉన్నారు.
పిలుపునకు వేలాదిమంది స్పందించారు. రంగంపేట సమితి మాజీ అధ్యక్షుడు ఉండవల్లి
లక్ష్మీపతి, ఆయన సోదరుడు ఉండవల్లి శ్రీహరిరావు లాంటి రాజకీయ వేత్తలను
ఆహ్వానించి వారి రాజకీయ అనుభవాలు, సూచనలు తీసుకుని అమలు చేసినట్టు
చెప్తారు. ఇంకా జిల్లా నుంచి బాలయోగి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల
రామకృష్ణుడు, మెట్ల సత్యనారాయణరావు, చిక్కాల రామచంద్రరావు, నల్లమిల్లి
మూలారెడ్డి, గన్ని కృష్ణ, ఎంవీఎస్ తాతాజీరావు, తాళ్లూరి లీలా భాస్కర
నారాయణ, కుదప సురేంద్ర, నెక్కంటి బాలకృష్ణ తదితరులు టీడీపీ తొలి రోజుల్లో
క్రియాశీలక పాత్ర పోషించారు.