March 2, 2013
ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి

నందివాడ, గుడివాడరూరల్, గుడ్లవల్లేరు, పట్టణంలోని నేత లు, కార్యకర్తలు చంద్రబాబు పాదయాత్ర సమాచారాన్ని ఇంటింటికి చెరవేసి వేలాది మంది ప్రజల్ని నెహ్రూచౌక్‌లో జరిగే బహిరంగ సభకు తీసుకువచ్చి టీడీపీ సత్తా చాటాలని ఉద్బోధించారు.
వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడేలా చేయాల న్నారు. 5వ తేదీ మధ్యాహ్నాం 2గంటలకు రూరల్ మండలం గాం«ధీ ఆశ్రమానికి ప్రతి నేత, కార్యకర్త చేరుకుని అధినేతకు ఘనస్వాగతం పలకాల న్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు మాట్లాడుతూ ఎమ్మె ల్యే అంబటి బ్రహ్మణయ్యకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ అవనిగడ్డలో కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి టీడీపీ సత్తా చాటారన్నారు. అదే ఉత్సాహంతో పార్టీ నేత లు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలన్నారు. చంద్రబాబు పాదయాత్ర విజయంతానికి అం దరూ సమిష్టిగా కృషి చేయాలని పలువురు నేతలు సూచించారు.
Posted by
arjun
at
11:16 PM